Share News

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను రద్దు చేసిన ఘనత మాదే

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:52 AM

గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన చీకటి చట్టం ల్యాండ్‌ టైటిల్‌ యాక్డు చట్టాన్ని రద్దు చేసి రైతులకు హక్కులను కల్పించిన ఘనత కూట మి ప్రభుత్వానిదే అని రోడ్లు భవనా ల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను రద్దు చేసిన ఘనత మాదే
మీరాపురంలో పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన చీకటి చట్టం ల్యాండ్‌ టైటిల్‌ యాక్డు చట్టాన్ని రద్దు చేసి రైతులకు హక్కులను కల్పించిన ఘనత కూట మి ప్రభుత్వానిదే అని రోడ్లు భవనా ల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయం త్రం మండలంలోని మీరాపురం గ్రామలో పట్టాదారు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బనగానపల్లె ఆర్డీవో నరసింహు లు, తహసీల్దారు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామంలోని 308 మంత్రి రైతులకు రాజము ద్రతో కూడిన పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు. మంత్రి బీసీ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో సీఎంగా పనిచేసిన జగన్‌ పట్టాదారు పాసు పుస్తకాలలో తనపేరు ముద్రిం చుకొని రైతుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. కోట్ట రూపాయలు ధనాన్ని వృధా చేశారు. కొత్త పాసు పుస్తకాలు ఇంటింటికి వెళ్లి పంిపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నరసింహులు, తహసీల్దారు నారాయణరెడ్డి, టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్‌ శివశంకర్‌రెడ్డి, బత్తులబాలిర రెడ్డి, బత్తుల భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 12:53 AM