Share News

హామీలను అమలు చేస్తున్నాం

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:11 AM

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

హామీలను అమలు చేస్తున్నాం
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి టీజీ భరత

మంత్రి టీజీ భరత

19వ వార్డులో వైసీపీని వీడి టీడీపీలోకి..

కర్నూలు అర్బన, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. గురువారం నగరంలోని మంత్రి కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ‘చెప్పాం.. చేస్తున్నాం’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నగరంలోని 19వ వార్డుకు చెందిన పలువురు ముస్లిం నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. షేక్‌ అన్వర్‌ బాషా, షేక్‌ చాంద్‌ బాషా, షేక్‌ అబ్బాస్‌ ఖాన తదితరులకు మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. మంత్రి మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి అభ్య ర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేయా లని కోరారు. కార్యక్రమంలో కూటమి మేయర్‌ అభ్యర్థి విజయ ప్రత్యూష, కార్పొరేటర్‌ అభ్యర్థులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరె క్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 12:12 AM