అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:11 AM
సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహకారంతో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
కోవెలకుంట్ల, నవంబరు 26, (ఆంధ్రజ్యోతి) : సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహకారంతో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. కోవెలకుంట్లలోని టీడీపీ కార్యాలయంలో సర్పంచ్ అభ్యర్ధులు, వార్డు మెం బర్లు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూటమి మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.510 కోట్లు మంజూరయ్యాయన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి ఏ ర్పాటు చేయిస్తామని, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. టీడీపీ మద్దతు తెలిపిన అభ్యర్థులకు ఓటేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో గువ్వల సుబ్బారెడ్డి, గడ్డం రామకృష్ణారెడ్డి, చిలమకూరి వెంకట సుబ్బారెడ్డి, కలుగొట్ల అర్జున్ రెడ్డి, శ్రీనిధి హోటల్ మద్దిలేటి, వెలగటూరు ధనుంజయుడు, బిజినవేముల హుస్సేనయ్య, కరిమద్దెల మురళి, కరిమద్దెల నాగేంద్రబాబు, పెనుగొండ రాజశేఖర్, కుళాయి తదితరులు పాల్గొన్నారు.