అభివృద్ధి చేస్తున్నాం
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:58 PM
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్యశాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
ఓర్వకల్లుకు క్యూలో పరిశ్రమలు
పింఛన్ల పంపిణిలో మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్యశాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. బుధవారం నగరంలోని ఎర్రబురుజులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. వార్డుల్లో పర్యటిం చినప్పుడు ప్రజల స్పందన చూస్తే ఇది స్పష్టంగా అర్థమౌతోందన్నారు. కర్నూలు జిల్లాల్లో వలసలు తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పరిశ్రమలు తెస్తున్నట్లు తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు ఇప్పటికే రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. త్వరలో రూ. 300 కోట్ల పెట్టుబడులతో ఎలక్ర్టిక్ వెహికల్ కంపెనీ రాబోతుందన్నారు. రిలయన్స్ కంపెనీ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్ ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తుందన్నారు. కర్నూల్లోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బొందిలి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ విక్రమ్ సింగ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేష్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.