Share News

అభివృద్ధి చేస్తున్నాం.. సమస్యలుంటే చెప్పండి

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:36 AM

knl news

 అభివృద్ధి చేస్తున్నాం.. సమస్యలుంటే చెప్పండి
నందికొట్కూరు 3 ::నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తున్నాం.. సమస్యలుంటే చెప్పండి ఫ వైసీపీ ఐదేళ్ల పాలనను.. రెండేళ్ల కూటమి పాలనను

వైసీపీ ఐదేళ్ల పాలనను.. రెండేళ్ల కూటమి పాలనను

పరిశీలించండి

ఇంటింటి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త

నందికొట్కూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ హయాంలో కంటే కూటమి ప్రభుత్వం రెండేళ్లలో నందికొట్కూరులో అభివృద్ధి ఎక్కువగా చేసిందని, ఇంకా ఏమైనా సమస్యలుంటే చెప్పాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పట్టణవాసులను కోరారు. శుక్రవారం పట్టణంలో రూ.15 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం 16వ వార్డు ఇన్‌చార్జి శ్రీకాంత్‌, 17వ వార్డు ఇంచార్జీ భరత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ పథకాలు, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని గుర్తు చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో పట్టణం ఏవిధంగా అభివృద్ధి జరిగింది..? కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరుగుతున్నదన్న విషయాన్ని అంశాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, సొసైటీ ఛైర్మన్‌ ముర్తుజావళి, మాజీ కౌన్సిలర్లు జాకీర్‌ హుస్సేన్‌, చిన్నరాజు, టీడీపీ నాయకులు జమీల్‌, లాయర్‌ జాకీర్‌, షకీల్‌ అహ్మద్‌, రజిని కుమార్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, కృష్ణారెడ్డి, ఆర్టు శ్రీను, రవికుమార్‌, విజయవాణి పాఠశాల కరస్పాం డెంట్‌ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

దినసరి కూలీలకు రూ.500 పెంపు : మున్సిపాల్టీలో పని చేసే దినసరి కూలీలకు ఇంత వరకు ఏ ప్రభుత్వం కూడా వేతనాలు పెంచిన దాఖలాలు లేవని కూటమి ప్రభుత్వం దినసరి కూలీల కష్టాన్ని గుర్తించి వారికి రూ.300 నుంచి రూ.500 కూలీ పెంచిందని ఎమ్మెల్యే గిత్తా తెలిపారు. వేతనాలు పెంచడంతో దినసరి కార్మికులు ఏర్పాటుచేసిన కృతజ్ఞత సభ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మాణాలకు రూ.22 కోట్లను సీఎం చంద్రబాబు నాయుడు మంజూరు చేశారన్నారు. కాబట్టి కార్మికులు కూడా పెంచిన వేతనాలతో రెట్టింపు ఉత్సాహంతో పని చేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కాలువల వద్ద పని చేసిన వారికే రూ.500 వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. అనంతరం కూరగాయల మార్కెట్‌ను పరిశీ లించి కూరగాయల వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో నీటి వసతి, టాయిలెట్‌ను ఏర్పాటు చేయాలని వ్యాపారులు కోరగా మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రామాలయం వీధిలో దెబ్బతిన్న డ్రైనేజీని, పలు సమస్యలను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

Updated Date - Aug 01 , 2026 | 12:38 AM