Share News

పీఎంశ్రీ పాఠశాలల్లో భవిష్యత్తుకు బాట

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:17 AM

కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా పాఠశాలలో నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయని పీఎంశ్రీ పాఠశాలల సెంట్రల్‌ నోడల్‌ ఆఫీసర్‌ డా.ఇషిత గంగోలి త్రిపాటి అన్నారు. మంగళవారం ఓర్వకల్లులోని పీఎంశ్రీ ఏపీఎంఎస్‌ పాఠశాలను ఆమె సందర్శించారు.

పీఎంశ్రీ పాఠశాలల్లో భవిష్యత్తుకు బాట
మోడల్‌ స్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఇషిత గంగోలి త్రిపాటి

ఓర్వకల్లు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా పాఠశాలలో నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయని పీఎంశ్రీ పాఠశాలల సెంట్రల్‌ నోడల్‌ ఆఫీసర్‌ డా.ఇషిత గంగోలి త్రిపాటి అన్నారు. మంగళవారం ఓర్వకల్లులోని పీఎంశ్రీ ఏపీఎంఎస్‌ పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇషిత గంగోలికి స్వాగతం పలికారు. స్కూల్‌ ఇన్‌స్ట్రక్చర్స్‌ సైన్స్‌, పీఏఎల్‌, కంప్యూటర్‌ ల్యాబ్స్‌, రికార్డులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. సైౖన్స్‌ ల్యాబ్‌లో విద్యార్థులు చేపట్టిన వివిద రకాల ల్యాబ్‌ ప్రాజెక్టుల వివరాలు తెలుసుకున్నారు. కంప్యూటర్‌ గదికి వెళ్లి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో జీసీడీవో జయలక్ష్మి, డీఈవో సుధాకర్‌, ఏపీసీ లోక్‌రాజు, ఎంఈవో ఓంకార్‌ యాదవ్‌, జీఈసీడీవో స్నేహలత, ఏఎంవో రఫీక్‌, సీఎంవో ధనరాజ్‌, ఏపీఎంఎస్‌ ప్రిన్సిపల్‌ జోషిలా వాట్స్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కేంద్రీయ విద్యాలయం తనిఖీ

కర్నూలు ఎడ్యుకేషన్‌: స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని మంగళవారం ఢిల్లీ ఐఏఎస్‌ జాయింట్‌ సెక్రటరీ డా.ఇషితా గంగూలి త్రిపాఠి సందర్శించారు. ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా పథకం ద్వారా చేపట్టే పనులు పరిశీలించారు. సైన్స్‌ ల్యాబోరేటరీ కంప్యూటర్‌ ల్యాబ్‌లు, లైబ్రరీ, ఇన్నోవేషన్‌ అండ్‌ స్కిల్‌ డెవలపెమెంట్‌ సెంటర్‌తో సహా వివిధ సౌకర్యాలను ఆమె పరిశీలించారు. ప్రిన్సిపాల్‌ ప్రియదర్శినితో పాటు డీఈవో సుధాకర్‌, ఎస్‌ఎ్‌సఏ ఏపీసీ లోక్‌రాజ్‌, కేజీబీవీ ఫ్యాకల్టీ జయలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:17 AM