Share News

నీరులేని తొట్లు

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:35 AM

మేత కోసం పొలాలకు వెళ్లే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం నీటి తొట్లను నిర్మించింది. ఇంతవరకు బాగానే ఉన్నా, వాటిని నీటితో నింపకుండా పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పశువులకు నీరు అందడం లేదు.

నీరులేని తొట్లు
సంజామలలో నీరులేని తొట్టి

నీరు నింపకుండా వదిలేసిన అధికారులు

మూగజీవాలకు అందని తాగునీరు

సంజామల, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): వేసవిలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఉపాధి పథకం కింద అధికారులు నీటితొట్లను నిర్మించారు. అయితే నీటితో నింపకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. 17 గ్రామ పంచాయతీలకు 21తొట్లు మంజూరుకాగా 15 తొట్లను పూర్తిచేశారు. 2014-19లో నాటి టీడీపీ ప్రభుత్వం ఒక్కో తొట్టికి రూ.33వేల చొప్పున తొట్లను నిర్మించారు. అయితే వాటిని నీటితో నింపకపోవడంతో నీరు తాగేందుకు వచ్చే మూగజీవాలు వెనుదిరుగు తున్నాయి. అధికారులు స్పందించి తొట్లను నీటితో నింపాలని పశు యజమానులు కోరుతున్నారు.

నిర్మించే వరకే మా బాధ్యత

మండలంలో ఉపాధి నిధులతో నీటితొట్లను నిర్మించాం. తొట్లను నిర్మించేవరకే మా బాధ్యత, నీరు నింపడం, నిర్వహణ గ్రామ పంచాయతీ వారే చూసుకోవాలి. - రవిప్రకాష్‌, ఏపీవో, సంజామల.

తొట్లను నీటితో నింపాలి

గొర్రెలు, మేకలు, బర్రెల పోషిస్తున్నాం. పొలాల్లో మేతకు తీసుకెళ్లిన సమయంలో నీరు లభించక పశువులు ఇబ్బంది పడుతున్నారు. వేసవిలో కాలువల్లో నీరు లేదు. అధికారులు తొట్లను నీటితో నింపాలి. - గోపాల్‌, పశుపోషకుడు, సంజామల

Updated Date - Jun 12 , 2026 | 12:35 AM