Share News

ఆర్డీఎస్‌కు జలకళ

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:44 PM

ఉభయ రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ విస్తారంగా వర్షాలు కురవడంతో తుంగభద్ర నదిలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది.

ఆర్డీఎస్‌కు జలకళ

ఉభయ రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ విస్తారంగా వర్షాలు కురవడంతో తుంగభద్ర నదిలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. కోసిగి మండలంలోని అగసనూరు సమీపంలో ఉన్న రాజోలిండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్డీఎస్‌) ఆనకట్టకు జలకళ సంతరించుకుంది. మొన్నటివరకు చుక్కనీరు లేక వెలవెలబోయిన ఆర్డీఎస్‌ ఆనకట్టపై నుంచి ప్రస్తుతం వర్షపు నీరు ఉరకలేస్తూ దిగువకు పరవళ్లు తొక్కుతోంది. రాబోయే రోజుల్లో సాగునీటికి ఇబ్బందులు ఉండవని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కోసిగి, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 18 , 2026 | 11:44 PM