సాగునీరు వృథా
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:25 AM
పట్టణ సమీపంలోని కొత్తకాల్వ కల్వర్టుకు వేస్టేజీ అడ్డుపడటంతో సాగునీరు వృథాగా పోతోంది. అవుకు రిజర్వాయర్‌లో అంతర్భాగమైన పాలేరు చెరువు నుంచి ఆయకట్టుకు సాగునీరందించేందుకుకల్వర్టును నిర్మించారు.
కల్వర్టులో పడ్డ రాళ్లు, రోడ్డుపైకి వెళుతున్న సాగునీరు
అవుకు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని కొత్తకాల్వ కల్వర్టుకు వేస్టేజీ అడ్డుపడటంతో సాగునీరు వృథాగా పోతోంది. అవుకు రిజర్వాయర్‌లో అంతర్భాగమైన పాలేరు చెరువు నుంచి ఆయకట్టుకు సాగునీరందించేందుకుకల్వర్టును నిర్మించారు. ఈ కాలువ కింద దాదాపు వెయ్యి ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే నాలుగు రోజులక్రితం కల్వర్టుకు రక్షణగా నిర్మించిన గోడపై టిప్పర్ బోల్తా పడటంతో గోడ ధ్వంసమై రాళ్లు, వేస్టేజీ కల్వర్టుకు అడ్డుపడింది. దీంతో నీరు ముందుకు పోలేక వృథాగా పారుతోంది. అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.