Share News

చెరువు నీరు వృథా

ABN , Publish Date - May 26 , 2026 | 12:54 AM

చేపల పెంపకందారులు కొండమాయపల్లె చిన్నరాజచెరువు తూములను అనధికారరంగా ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో విలువైన నీరు వృథా అయి, గ్రామమంతా చిత్తడిగా మారింది

చెరువు నీరు వృథా
కొండమాయపల్లెలో ప్రవహిస్తున్న చెరువు నీరు

తూములు ఎత్తిన చేపల పెంపకందారులు

రుద్రవరం, మే 25 (ఆంధ్రజ్యోతి): చేపల పెంపకందారులు కొండమాయపల్లె చిన్నరాజచెరువు తూములను అనధికారరంగా ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో విలువైన నీరు వృథా అయి, గ్రామమంతా చిత్తడిగా మారింది. చేపలు పట్టుకోడానికే ఇలా చేసినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం చేపలను వలలు వేసి పట్టుకోవాలే ఆని ఇలా తూములు ఎత్తకూడదు. ముందే నీటి ఎద్దడి ఉండగా ఇలా వృథాచేయంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రెవెన్యూ, మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోకపోవంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లా అధికారులు స్పందించి, నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - May 26 , 2026 | 12:54 AM