Share News

రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:14 AM

రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసి ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.

రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం
చింతకుంట చెరువును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ఆళ్లగడ్డ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసి ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారంలోని చింతకుంట గ్రామంలో చెరువులకు పరిశీలించారు. ఈ సందర్బంగా గ్రామ పెద్దలు, రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులు వినియోగిస్తున్న సూక్ష్మ సేద్యాన్ని ప్రభుత్వం ప్రొత్సహిస్తుందన్నారు. అక్టోబరు 2న మదనపల్లెలో ప్రారంభించనున్న ఇంటిగ్రేటెడ్‌ హర్టికల్చర్‌ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ఉద్యానవన రంగానికి మరింత ప్రాధాన్యం లభిస్తుందన్నారు. నియోజకవర్గంలోని 80శాతం చెరువులను నీటితో నింపామని, సహకరించిన అధికారులను ఎమ్మెల్యే అభినందించారు.

Updated Date - Oct 01 , 2026 | 12:14 AM