Share News

అవుకు రిజర్వాయర్‌కు జలకళ

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:38 AM

అవుకు రిజర్వాయర్‌ జలకళను సంతరించుకుంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక చెరువులు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చొరవతో గోరుకల్లు నుంచి గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎ్‌సఎ్‌స) నుంచి ఎస్సార్బీసీ ద్వారా రిజర్వాయర్‌కు నీరు తరలించారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.148 టీఎంసీలు. ప్రస్తుతం 2.79 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. కడప జిల్లా ప్రజల తాగునీటి కోసం రిజర్వాయర్‌ సమీపంలోని జీఎన్‌ఎ్‌సఎ్‌స హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఇప్పటి వరకు 2.5 టీఎంసీల నీటిని తరలించారు.

అవుకు రిజర్వాయర్‌కు జలకళ
రిజర్వాయర్‌లో నీరు

జీఎన్‌ఎ్‌సఎ్‌స, ఎస్సార్బీసీకి నీరు విడుదల చేయించిన మంత్రి బీసీ

రిజర్వాయర్‌లో 2.79 టీఎంసీల నీరు నిల్వ

కడప జిల్లాకు 2.5 టీఎంసీల తరలింపు

నిండిన చెరువులు, పెరిగిన భూగర్భ జలాలు

అవుకు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అవుకు రిజర్వాయర్‌ జలకళను సంతరించుకుంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక చెరువులు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చొరవతో గోరుకల్లు నుంచి గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎ్‌సఎ్‌స) నుంచి ఎస్సార్బీసీ ద్వారా రిజర్వాయర్‌కు నీరు తరలించారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.148 టీఎంసీలు. ప్రస్తుతం 2.79 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. కడప జిల్లా ప్రజల తాగునీటి కోసం రిజర్వాయర్‌ సమీపంలోని జీఎన్‌ఎ్‌సఎ్‌స హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఇప్పటి వరకు 2.5 టీఎంసీల నీటిని తరలించారు. ఎస్సార్బీసీ కాల్వ నుంచి వచ్చిన నీటితో వేములపాడు, మెట్టుపల్లె చెరువులతో పాటు శింగనపల్లె పర్కులేషన్‌ ట్యాంకును నింపారు. అలాగే ఎత్తిపోతల పథకం ద్వారా సంగపట్నం చెరువును నింపుతున్నారు. దీంతో గ్రామాల్లోని ప్రజల తాగునీటి అవసరాలు తీరటమే కాక భూగర్భజలాలు పెరగటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాగు నీటికి అత్యంత ప్రాధాన్యం

బనగానపల్లె నియోజకవర్గంలోని ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రిజర్వాయర్‌ వద్ద రూ. 36.50 కోట్లతో కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ వాటర్‌ సప్లయ్‌ (సీపీడబ్యూఎస్‌) స్కీం నిర్మించారు. ఈ పథకం ద్వారా అవుకు, కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాల్లోని 50 గ్రామాలకు ప్రతి రోజు 40 లక్షలు లీటర్లు (4ఎంఎల్‌డీ) తాగునీరు అందుతుంది. కొలిమిగుండ్ల మండలంలోని రాంకో సిమెంట్‌ ఫ్యాక్టరీకి ప్రతి రోజు 25 లక్షలు లీటర్లు (2.5 ఎంఎల్‌డీ) నీటిని రిజర్వాయర్‌ నుంచి తరలిస్తున్నారు. ఇంతటి విషమ పరిస్థితుల్లో కూడ రిజర్వాయర్‌ నుంచి జీఎన్‌ఎ్‌సఎ్‌స ద్వారా 2.5 టీఎంసీలు నీటిని కడప జిల్లా గండికోటకు తరలించారు. అలాగే రిజర్వాయర్‌ నుంచి 12ఏ ఎస్పార్బీసీ (సంగపట్నం) కాల్వకు 200 క్యూసెక్కుల నీరు వెళుతోంది.

పాలేరు లీకేజీ నీటితో వరి సాగు..

రిజర్వాయర్‌లో అంతర్భాగమైన పాలేరు చెరువు స్లూయిస్‌ ప్రారంభం నుంచి లీకేజీ అవుతుంది. వృథాగా బయటకు వస్తున్న ఈ నీటితో అవుకు, చెన్నంపల్లె, శివవరం, అన్నవరం, గుండ్లశింగవరం గ్రామాల్లోని రైతులు వెయ్యి ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. రిజర్వాయర్‌లో 2.79 టీఎంసీలు నీరు నిల్వ ఉన్న తాగునీటి అవసరాల కోసం లోకల్‌ ఆయకట్టుకు కూడ అధికారులు నీరు వదలలేదు. ఈ ఖరీ్‌ఫలో దాదాపు 3 వేలు ఎకరాల్లో ఇప్పటి వరకు పంటలు సాగు కాలేదు.

చెరువులు నిండి భూగర్భజలాలు పెరిగాయి

మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి చొరవ తీసుకొని గోరుకల్లు నుంచి జీఎన్‌ఎ్‌సఎ్‌స కెనాల్‌ ద్వారా నీటిని తరలించి రిజర్వాయర్‌ను నింపారు. పాలేరు చెరువు నుంచే వచ్చే లీకేజీ నీటితో 10 ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. - మిద్దె శ్రీనివాసులు, రైతు, అవుకు.

నీటిని సద్వినియోగం చేసుకోవాలి

అవుకు రిజర్వాయర్‌లో 2.79 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎస్సార్బీసీ ద్వారా వచ్చిన నీటితో చెరువులను నింపాం. భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. - భవానిప్రసాద్‌రెడ్డి, ఎస్సార్బీసీ ఇన్‌చార్జి ఈఈ, అవుకు.

Updated Date - Sep 17 , 2026 | 12:38 AM