Share News

6 వరకు జీడీపీకి నీరు

ABN , Publish Date - Mar 27 , 2026 | 11:38 PM

గాజులదిన్నె ప్రాజెక్టు ఎడవ కాలువ ద్వారా ఆయకట్టు పంటలకు ఏప్రిల్‌ 6వ తేది వరకు నీరు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

6 వరకు జీడీపీకి నీరు
జీడీపీ ఎడవ కాలువకు విడుదల అయిన 40 క్యూసెక్కుల నీరు

ఆనందం వ్యక్తం చేస్తున్న ఎడమ కాలువ రైతులు

31న కుడి కాలువకు నిలిపివేత

గోనెగండ్ల, మార్చి27(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు ఎడవ కాలువ ద్వారా ఆయకట్టు పంటలకు ఏప్రిల్‌ 6వ తేది వరకు నీరు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో మార్చి 31న జీడీపి కింద ఉన్న ఆయకట్టు భూములకు కుడి, ఎడమ కాలు వలకు విడుదల అయ్యే నీటిని నిలిపి వేయాలని ఉన్నతాధి కారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎడవ కాలువకు నీటి విడుదలను ఏప్రిల్‌ నెల 6వ తేది వరకు పొడి గించారు. ఎడవ కాలువకు రోజుకు 40 క్యూసెక్కుల ప్రకారం నీరు విడుదల కానుంది. ఆ కాలువ కింద 3000 ఎకరాలు సాగు కావాల్సి ఉండగా 1600 ఎకరాలు పంట సాగు అయింది. ఎడవ కాలువ కింద మరో వారం రోజులు నీటి విడుదల పెరగడంతో ఆ కాలువ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రబీలో కుడికాలువ కింద 11500 ఎకరాల పంట సాగయింది. రైతులకు పంట చేతికి రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుడి కాలు వకు నీటి విడుదలను ఈ నెల 31 న నిలిపివేయనున్నారు. ప్రస్తుతం జీడీపీలో 2.1 టీఎంసీ నీరు ఉంది. ఇక ఏప్రిల్‌ నెల నుంచి ప్రాజెక్టు కింద ఉన్న తాగునీటి పథకాలకు మాత్రమే నీటి విడుదల జరుగుతుంది. ప్రాజెక్టు కింద బండగట్టు, క్రిష్టగిరి, డోన్‌, పథకాలతో పాటు అవసర సమయంలో కోడుమూరు, గూడురు, బెళగల్‌, ప్రాంతాలకు నీరు మళ్లిస్తారు.

Updated Date - Mar 27 , 2026 | 11:38 PM