Share News

సాగునీటి ఇబ్బంది రాకుండా చూస్తాం

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:27 AM

రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. గురువారం ఉడుములపాడు గ్రామం చెరువును ఎమ్మెల్యే కోట్ల రైతులతో కలిసి పరిశీలించారు.

సాగునీటి ఇబ్బంది రాకుండా చూస్తాం
ఉడుములపాడు చెరువును పరిశీలిస్తున్న కోట్ల

డోన్‌ టౌన్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. గురువారం ఉడుములపాడు గ్రామం చెరువును ఎమ్మెల్యే కోట్ల రైతులతో కలిసి పరిశీలించారు. చెరువు పరిస్థితి, నీటి లభ్యత, రైతులకు ఉపయోగకరంగా చేపట్టాల్సిన అభివృద్ది పనులపై స్థానికులతో చర్చించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతు సంక్షేమమే లక్ష్యమని పేర్కొన్నారు. నీటి సంఘం అధ్యక్షుడు నాగభూషణంగౌడు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సలీంధ్ర శ్రీనివాసులు యాదవ్‌, కొత్తపల్లి రంజిత్‌ కిరణ్‌, ఓంప్రకాష్‌, సీమ సుబ్బారెడ్డి, కాంట్రాక్టరు ఉడుములపాడు శ్రీను, మాజీ సర్పంచ్‌ రామాంజనేయులు పాల్గొన్నారు.

ట్రయల్‌రన్‌ సక్సెస్‌

ఉడుములపాడు చెరువు నుంచి వెంకటనాయునిపల్లె కుంటకు పైపులైన్‌ ద్వారా నీరు తరలించే ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయింది. వెంకటనాయునిపల్లె గ్రామంలో నీరు మళ్లింపును నెల 11న ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సలీంధ్ర శ్రీనివాస్‌ యాదవ్‌ గురువారం తెలిపారు. ఇరిగేషన్‌ అధికారి డి.చంద్రశేఖర్‌, ఏఈ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:27 AM