Share News

నిలిచిన నీటి ప్రవాహం

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:05 AM

తెలుగుగంగ ప్రధాన కాల్వలో నీరు నిలిపిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 నిలిచిన నీటి ప్రవాహం
తెలుగుగంగ ప్రధాన కాలువలో నిలిచిన నీటి ప్రవాహం

సాగునీటి కోసం రైతుల ఆందోళన

రుద్రవరం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలుగుగంగ ప్రధాన కాల్వలో నీరు నిలిపిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు భూముల్లో మొక్కజొన్న వేరుశెనగ, వరి, మినుము, తదితర పంటలను వేలాది ఎకరాల్లో సాగు చేశారు. నీటి ప్రవాహం నిలిచిపోవడంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని, అధికారులు నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.

Updated Date - Feb 09 , 2026 | 12:05 AM