Share News

నీటి నమూనాలను పరీక్షించాలి

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:12 PM

విద్యార్థులు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వ వసతి గృహాల్లో, పాఠశాలల్లో నీటి నమూనాలను 15 రోజులకు ఒకసారి సేకరించి పరీక్షించాలని కలెక్టర్‌ డా.ఏ. సిరి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని ఆదేశించారు.

నీటి నమూనాలను పరీక్షించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ డా.సిరి

కలెక్టర్‌ డా.ఏ. సిరి

కర్నూలు కలెక్టరేట్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వ వసతి గృహాల్లో, పాఠశాలల్లో నీటి నమూనాలను 15 రోజులకు ఒకసారి సేకరించి పరీక్షించాలని కలెక్టర్‌ డా.ఏ. సిరి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లా స్థాయి జాయింట్‌ ఇన్‌ఫెక్షన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్‌వో ప్లాంట్లు, మరుగుదొడ్లు మరమ్మతుల అంచనాలను వెంటనే పంపించాలని ఆర్‌డబ్ల్యూ ఎస్‌ఎస్‌ఈని ఆదేశించారు. కర్నూలు మెడికల్‌ కళాశాల గర్ల్స్‌ హాస్టల్‌లో మరమ్మతుల పనులు త్వరితగతిన చేయించాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డా. భాస్కర్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా. వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. చిట్టినరసమ్మ, సాంఘిక సంక్షేమ అధికారి రాధిక పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 11:12 PM