కేసీ కాలువకు నీరు విడుదల
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:50 PM
కేసీ కెనాల్‌కు జలవనరుల అధికారులు నీరు విడుదల చేశారు.
మల్యాల నుంచి 330 క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి 245..
నందికొట్కూరు రూరల్, ఫిబ్రవరి23.(ఆంధ్రజ్యోతి): కేసీ కెనాల్‌కు జలవనరుల అధికారులు నీరు విడుదల చేశారు. సోమవారం మల్యాల వద్ద గల హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నుంచి ఒక పంపు ద్వారా 330 క్యూసెక్కులను విడుదల చేశారు. కాలువకు నీరు ఆగిపోవడంతో ఇటీవల కేసీ ఆయకట్టు రైతులు ఎమ్మెల్యే జయసూర్య, నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డిని కలిసి పంటలు ఎండిపోతున్నాయని, ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే జయసూర్య, మాండ్ర శివానందరెడ్డి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల, జిల్లా అధికారులతో చర్చించి, సమస్యను పరిష్కరించారు. దీంతో రైతులు ఎమ్మెల్యే, మాండ్రకు కృతజ్ఞతలు తెలిపారు, పంట చేతికివచ్చే వరకు నీటి విడుదల కొనసాగించాలని కోరారు.
పగిడ్యాల: మండలంలోని ముచ్చుమర్రి ఎతిపోత్తల పథకం నుంచి కేసీ కాలువకు సోమవారం నీటిని విడుదల చేసినట్లు కేసీ కెనాల్ ఏఈ వీరమ్మ తెలిపారు. ఈ నెల 13న నీటిని నిలిపివేయగా, ఆయకట్టు రైతులు నందికొ ట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి తమ సమస్యను వివవరించారన్నారు. వారు జలవనరుల మంత్రి, అధికారులతో మాట్లాడి కేసీ కాలువకు నీటిని విడుదల చేయించినట్లు తెలిపారు. ఎతిపోత్తల నుంచి ఒక మోటరు ద్వారా 245 క్యూసెకులను విడుదల చేశామన్నారు.