తాగునీటి కోసం జీడీపీ నీరు విడుదల
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:19 PM
పలు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేదుకు జీడీపీ అధికారులు ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి వంద క్యూసెక్కల నీటిని విడుదల చేశారు.
గోనెగండ్ల, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): పలు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేదుకు జీడీపీ అధికారులు ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి వంద క్యూసెక్కల నీటిని విడుదల చేశారు. కోడుమూరుకు 40 క్యూసెక్కులు, గూడూరుకు 40 క్యూసెక్కులు, అలువాల ఎస్‌ఎ్‌స ట్యాంక్‌కు 20 క్యూసెక్కు ప్రకారం నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు ఎడమ కాలువ నుంచి కోడుమూరు హంద్రీ-నదికి 80 క్యూసెక్కుల విడుదల చేయగా అందులో నుంచి 40 క్యూసెక్కలను గూడూరు హంద్రీ నదికి మళ్లిస్తారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా సెప్టెంబరు నెల మధ్యకు వచ్చినప్పటికీ వర్షాలు మాత్రం కురియలేదు. దీంతో హంద్రీనదిలో నీరు పారకపోవడం, ముళ్లపొదలు పెరిగిపోవడం, ఇసుక అక్రమ రవాణా మితిమీరిపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో తాగునీటి పథకాలకు నీరు అందకపోవడంతో కోడుమూరు, గూడూరులో తాగునీటి సమస్య తీవ్రమైంది. విడుదలయిన జీడీపీ నీరు కోడుమూరుదగ్గర ఉన్న సుద్దవంక ద్వారా కోడుమూరు హంద్రీ నదికి చేరుతుంది. అయితే సుద్దవంక వాగులో ఉన్న జమ్ము, ముళ్ల పొదలను జీడీపీ సాగునీటి సంఘం నాయకులు శుభ్రం చేయించారు. దీంతో నీరు ఏకంగా హంద్రీనదిలోని తాగునీటి పథకం చేరుతుంది. అక్కడ ఉన్న బోరుబావులు జీడీపీ నీటితో భూగర్భజలాలు పెరిగి నీటిపథకాలకు నీరు అందుతుంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురియ పోవడంతో ఇప్పటికి కోడూమూరుకు తాగునీటి కోసం ఐదోసారి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం గాజులదిన్నె ప్రాజెక్టులో 1.5 టీఎంసీల నీరు ఉన్నట్లు జీడీపీ అధికారులు తెలిపారు.
ఎండుతున్న హంద్రీ
జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలో ప్రతి ఏడాది వర్షాలు ఎక్కవగా కురిసి భూములో జోమునీరు పారేది. దీంతో హంద్రీలో కూడా నీటి ప్రవహించి తాగునీటి పథకాలకు నీటి ఇబ్బంది ఉండేది కాదు. అయితే ఈ ఏడాది ఇందుకు భిన్నంగా ఉంది. ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండటంతో జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలమధ్యకు వచ్చినప్పటికీ హంద్రీనదిలో నీరు పారేంతా వర్షం కురియలేదు. దీంతో హంద్రీ పరివాహక ప్రాంతాలలోని గ్రామాలలో వేసిన రింగ్ బోర్లు అడుగంటి పోతున్నాయి. ఈ కారణంగా తాగునీటి పథకాలకు నీరు అందడం లేదు. పుట్టపాశం, హెచ్,కైరవాడి, వేముగోడు, తిప్పనూరు. బోదేపాడు, కోడుమూరు తాగునీటి పఽథకాలకు నీటి కొరత ఏర్పడింది. తాగునీటి సమస్య అధికంగా ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.