ఎల్లెల్సీకి ఏప్రిల్ 1న నీటి విడుదల
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:34 AM
ఎండలు మండుతుండటంతో తాగునీటి పథకాలకు కూడా నీటి సమస్య మొదలయింది. తుంగభద్ర డ్యాం నుంచి ఎల్లెల్సీకి నీటి విడుదల చేయాలని ఎల్లెల్సీ అధికారులు డ్యామ్ అధికారు లకు ఇండెంట్ పె ట్టారు. ఏప్రిల్ 1వ తేదీన తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల జరుగుతున్నట్లు ఎల్లెల్సీ అధికారులు తెలుపుతున్నారు.
ఇండెంట్ పెట్టిన ఎల్లెల్సీ అధికారులు
గోనెగండ్ల, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఎండలు మండుతుండటంతో తాగునీటి పథకాలకు కూడా నీటి సమస్య మొదలయింది. తుంగభద్ర డ్యాం నుంచి ఎల్లెల్సీకి నీటి విడుదల చేయాలని ఎల్లెల్సీ అధికారులు డ్యామ్ అధికారు లకు ఇండెంట్ పె ట్టారు. ఏప్రిల్ 1వ తేదీన తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల జరుగుతున్నట్లు ఎల్లెల్సీ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే ఆదోని, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కోడుమూరు ప్రాంతాల్లో పలుచోట్ల తాగునీటి సమస్యతో ప్రజలు సతమతమవు తున్నారు. గోనెగండ్లలోని ఎస్‌ఎస్ ట్యాంక్‌లో నీరు అడుగంటి పోతే వారం రోజులుగా 9 గ్రామాలు తాగునీటి సమస్యను ఎదుర్కొన్నాయి. దీంతో అధికారులు నాయకుల చొరవతో అనాధికారికంగా గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని ఆ ఎస్‌ఎస్ ట్యాంక్‌కు మళ్లించి నట్లు తెలుస్తుంది. ఎల్లెల్సీకి 300 క్యూసెక్కులు విడుదల చేయనున్నట్లు సమాచారం. డ్యాం నుంచి నీరు విడుదల అయితే వాగులు, కుంటలు, చెరువులు, ఎస్‌ఎస్ ట్యాం క్‌లు నింపుకొని ఆదోని, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కోడుమూడు సెక్షనకు నీరు చేరడానికి దాదాపు 15 రోజులు పడుతుంది. గోనెగండ్ల సెక్షనలోని నీటి పథకాలకు, కుంటలకు, చెరువులకు ఎల్లెల్సీ నీటిని నింపుకున్న తరువాత కోడుమూరుకు మళ్లిం చాలా లేదా అన్నది అప్పటి పరస్థితుల పై ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మొదట్లో కోడుమూరు నీటిని గాజులదిన్నె ప్రాజెక్టులో నిలువ చేయనున్నట్లు తెలుస్తుంది.