అక్రమ కనెక్షన్లతో తాగునీటి ఇబ్బందులు
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:42 PM
గత వైసీపీ హయాంలో అక్రమ నీటి కనెక్షన్లు ఇవ్వడంతో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. 1,500 వరకు గృహ అవసరాల కనెక్షన్లు ఉండగా, అక్రమ కనెక్షన్లు 50 వరకు ఉన్నాయి. కొలిమిగుండ్ల ఎస్సీ కాలనీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు త్రాగునీటి పైపులైన్‌కు పదుల సంఖ్యలో అక్రమ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నారు
వ్యాపార అవసరాల కోసం అక్రమంగా నీటిని వాడుకుంటున్న అక్రమార్కులు
కొలిమిగుండ్ల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో అక్రమ నీటి కనెక్షన్లు ఇవ్వడంతో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. 1,500 వరకు గృహ అవసరాల కనెక్షన్లు ఉండగా, అక్రమ కనెక్షన్లు 50 వరకు ఉన్నాయి. కొలిమిగుండ్ల ఎస్సీ కాలనీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు త్రాగునీటి పైపులైన్‌కు పదుల సంఖ్యలో అక్రమ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నారు.
వాణిజ్య అవసరాలకు సైతం..
గృహ కనెక్షన్లతో పాటు ప్రధాన రహదారుల్లోని వాహనాల సర్వీసింగ్ సెంటర్లు, వ్యాపార సముదాయాలు, ఫ్యాక్టరీలకు సైతం తాగునీటి పైపులైన్ నుంచి కనెక్షన్ ఇచ్చారు. దీంతో వేలాది లీటర్ల నీరు వారు అక్రమంగా వినియోగిస్తుండటంతో గృహ వినియోగదారులకు అందడం లేదు. ఇంత జరుగు తున్నా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు న్నాయి. ఇప్పటికైనా స్పందించి అక్రమ కనెక్షన్లను తొలగించి, ప్రజలకు సక్రమంగా తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.