Share News

గొంతెండుతోంది..

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:41 AM

మండలంలోని చనుగొండ్ల గ్రామంలో తాగునీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 400 కుటుంబాలు ఉండగా, దాదాపు 2వేల మంది నివస్తున్నారు. రెండు నెలలుగా సమస్య ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామలోని మంచినీటి బావిలో నీరు అడుగంటడంతో తాగునీటి కొరత తీవ్రంగా మారిందని, సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

గొంతెండుతోంది..
ట్యాంకరు వద్ద నీరు పట్టుకుంటున్న గ్రామస్థులు

చనుగొండ్లలో తాగునీటి సమస్య,

ట్యాంకర్లు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు

డోన్‌ రూరల్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చనుగొండ్ల గ్రామంలో తాగునీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 400 కుటుంబాలు ఉండగా, దాదాపు 2వేల మంది నివస్తున్నారు. రెండు నెలలుగా సమస్య ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామలోని మంచినీటి బావిలో నీరు అడుగంటడంతో తాగునీటి కొరత తీవ్రంగా మారిందని, సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ట్యాంకర్లను ఏర్పాటుచేసిన టీడీపీ నాయకులు

గ్రామంలో తాగునీటి సమస్యను గమనించిన ఎమ్మెల్యే కోట్ల చొరవతో టీడీపీ నాయకుడు, సహకార పరపతి సంఘం చైర్మన్‌ శ్రీరాములు సొంత నిధులతో అయిదు ట్యాంకర్లను ఏర్పాటు చేయించారు. ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తుండటంతో సమస్య కొంత తగ్గింది. అలాగే బావిలో నీరు అడుగంటడంతో పైపులతో నీటిని బావిలోకి వదిలారు. పూర్తిస్థాయిలో పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:41 AM