శ్రీశైలంలో తగ్గుతున్న నీటి మట్టం
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:46 PM
శ్రీశైలం రిజర్వాయర్‌లో రోజుకో అడుగు నీటిమట్టం తగ్గిపోతోంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద నీరు పూర్తిగా నిలిచిపోవడంతో రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంలేదు.
శ్రీశైలం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వాయర్‌లో రోజుకో అడుగు నీటిమట్టం తగ్గిపోతోంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద నీరు పూర్తిగా నిలిచిపోవడంతో రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంలేదు. మరోవైపు విద్యుదుత్పత్తి, రిజర్వాయర్ అనుబంధ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగంతో నీటినిల్వలు తగ్గిపోతున్నాయి. ఆదివారం జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 21,463 క్యూసెక్కులు విడుదలైంది. జలాశయం నుంచి ఏపీ పవర్ హౌస్ ద్వారా 4,740, టీఎస్ పవర్ హౌస్ ద్వారా 42,315, హంద్రీ నీవా నుంచి 3,050, మల్యాల నుంచి 325, కల్వకుర్తి నుంచి 800, పోతిరెడ్డిపాడు నుంచి 8,000 క్యూసెక్కులు మొత్తంగా 59,230 క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా నమోదయ్యింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.70 అడుగులు ఉండగా, పూరిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 171.87 టీఎంసీల నిటి నిల్వలు మాత్రమే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.