అడుగంటిన తుండ్లవాగు రిజర్వాయర్
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:14 AM
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నల్లమల తీరంలోని తుండ్లవాగు రిజర్వాయర్‌లో నీటి నిలలు అడుగంటాయి.
రుద్రవరం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నల్లమల తీరంలోని తుండ్లవాగు రిజర్వాయర్‌లో నీటి నిలలు అడుగంటాయి. రిజర్వాయరును హరినగరం మంచినీటి పథకానికి అనుసంధానం చేశారు. రిజర్వాయరులో నీరు అడుగంటడంతో నీటి సరఫరాకు ప్రమాదం పొంచి ఉంది. నీరు లేకపోవడంతో రిజర్వాయరులో రాళ్లు, పచ్చిక బయళ్లు బయటపడ్డాయి.