Share News

రూ.540కోట్లతో వాటర్‌ గ్రిడ్‌

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:39 PM

నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అవుకు రిజర్వాయర్‌ వద్ద త్వరలో రూ.540 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని నిర్మిస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

రూ.540కోట్లతో వాటర్‌ గ్రిడ్‌

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

అవుకు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అవుకు రిజర్వాయర్‌ వద్ద త్వరలో రూ.540 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని నిర్మిస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం అవుకు పట్టణానికి చేరుకున్న మంత్రి బీసీకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయభాస్కర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, వెంకట రమణనాయక్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మంత్రి మా ట్లాడుతూ కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, సంజామల, బనగానపల్లె, అవుకు మండలాల ప్రజలకు వాటర్‌ గ్రిడ్‌తో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామా ల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవుకు పట్టణాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో జనసేన నాయకులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభిం చారు. టీడీపీ నాయకులు మొట్ల రామిరెడ్డి, దంతెల రమణ, తిక్కన్న, అరుణ్‌నాయక్‌, వంగల పరమేశ్వరరెడ్డి, ఆకుల నాగిరెడ్డి, మధుమోహన్‌రెడ్డి, కాట్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సాంబశివారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:39 PM