మొక్క మొక్కకూ నీరు
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:33 PM
ఎల్‌నినో దెబ్బతో వర్షాలు లేక కొందరు పంటను తొలగిస్తుండగా, మరి కొందరు రేపైనా వాన రాకపోతుందా.. అని మొక్కలకు జీవం పోస్తూ కాపాడుకుంటున్నారు.
ఎల్‌నినోతో ఎండిపోతున్న పైర్లు
కాపాడుకోడానికి ఆరాటపడుతున్న రైతులు
కోడుమూరు రూరల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో దెబ్బతో వర్షాలు లేక కొందరు పంటను తొలగిస్తుండగా, మరి కొందరు రేపైనా వాన రాకపోతుందా.. అని మొక్కలకు జీవం పోస్తూ కాపాడుకుంటున్నారు. అమడగుంట్లకు చెందిన రైతు రమేష్ ఆరెకరాల్లో పత్తి సాగు చేశాడు. సేద్యం, విత్తనాలు, కూలీల కోసం ఎకరాకు రూ. 15 వేలు ఖర్చు చేశారు. విత్తు వేసిన తర్వాత వర్షం కురవకపోవడంతో తరచూ కూలీలను పెట్టి పత్తి మొక్కలకు నీరు పోయిస్తున్నాడు. అలాగే లాల్‌కుమార్ అనే రైతు తన రెండెకరాలకు సమీప బోర్ల దగ్గర నుంచి నీరు తెచ్చి పోస్తున్నాడు. వాన రాకపోతుందా? అనే ఆశతో పైరు బెట్టకు వచ్చినపుడల్లా ఒక్కో కూలీకి రూ. 400 చొప్పున రూ 3 వేలు ఖర్చు చేస్తున్నట్లు రైతులు తెలిపారు.