Share News

‘జల సంరక్షణ’కు శ్రీకారం

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:33 PM

‘నీరు లేనిదే జీవరాసుల మనుగడ లేదు.. జల వనరులను కాపా డుకోవడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. ప్రజలందరి సామా జిక బాధ్యత’.. అంటూ సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం జల సంరక్షణకు శ్రీకారం చుట్టింది.

‘జల సంరక్షణ’కు శ్రీకారం
తుగ్గలి మండలం రాతన చెరువు

నీటి సంరక్షణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక

కలెక్టర్‌ పర్యవేక్షణలో జిల్లా కమిటీ

ఉపాధి నిధులతో నీటి అభివృద్ధి పనులు

ప్రతిపాదనలు తయారీలో నిమగ్నమైన అధికారులు

కోసిగి మండలంలో ప్రమాకర స్థాయిలో భూగర్భ జలాలు

‘నీరు లేనిదే జీవరాసుల మనుగడ లేదు.. జల వనరులను కాపా డుకోవడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. ప్రజలందరి సామా జిక బాధ్యత’.. అంటూ సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం జల సంరక్షణకు శ్రీకారం చుట్టింది. వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భజలాలు పెంచాలనే లక్ష్యంతో వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తున్నారు. ఉపాధి నిధులు వినియోగించి జల సంరక్షణ చర్యలు చేపట్టబోతున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు.

కర్నూలు, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలు పెంచేం దుకు ప్రతి మండలంలో దాదాపు రూ.2.5 నుంచి రూ.5కోట్ల విలువైన పనులు చేపట్టబో తున్నారు. ఈనెల 15లోగా ప్రతిపాదనలు పూర్తి చే యాలి. డ్వామా, జలవనరులు, భూగర్భజలాలు, వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక వంటి కీలక శాఖలను భాగస్వామ్యం చేశారు. కోసిగి, పెద్దకడబూరు మండలాల్లో ప్రమాదకర స్థాయిలో భూగర్భజలాలు పడిపోయాయని గుర్తించారు. గురువారం కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి కోసిగిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పిచ్చిమొక్కలు, ముళ్ల కంపలతో నిండిపోయి..

చిన్నతరహా నీటిపారుదల శాఖ పరిధిలోని కర్నూలు, డోన్‌, పత్తి కొండ, ఆదోని సబ్‌ డివిజన్లలో 100ఎకరాల ఆయకట్టు పైబడిన చెరు వులు 60, వంద ఎకరాల లోపు ఆయకట్టు కలిగిన చెరువులు 250 ఉన్నాయి. 310 చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం 4.411 టీఎంసీలు. 33,113 ఎకరాల ఆయకట్టు ఉంది. అత్యధిక చెరువులు శ్రీకృష్ణదేవ రాయుల కాలంలో నిర్మించినవే. మరమ్మతులు, పూడిక తీత చేపట్టకపోవడంతో పిచ్చిమొక్కలు, పూడిక, ముళ్లకంపలతో చెరువులు నిండి పోయాయి. చెరువులోకి వర్షపు నీరు చేరే వాగులు (ఫీడర్‌ ఛానల్స్‌), పంట కాలువలు (ఫీల్డ్‌ ఛానల్స్‌) పూడిపోగా, తూములకు మరమ్మతులకు నోచుకోవడం లేదు. డ్వామా ఆధ్వ ర్యంలో నిర్మించిన చెక్‌ డ్యాంలదీ ఇదే పరిస్థితి. గత టీడీపీ హ యాంలో ‘నీరు-చెట్టు’ నిధు లతో జల సంరక్షణ పనులు చేప ట్టారు. ఆతరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో చెరువులు, చెక్‌డ్యాంలు మళ్లీ పూర్వస్థితికి చేరుకున్నాయి.

ఈనెల 15లోగా ప్రతిపాదనలు సిద్ధం

జీరాంజీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే భూగర్భ సంరక్షణ పనులను గ్రామస్థాయి కమిటీ ఆధ్వర్యంలో గుర్తి స్తారు. ప్రతిపాదనలు తయారుచేసి ఉపాధి పథకంకు చెందిన యుక్త ధార యాప్‌ (పోర్టర్‌)లో అప్‌లోడ్‌ చేయాలి. ఈనెల 15లోగా ప్రతిపా దనలు సిద్ధంచేసి, కలెక్టర్‌ ఆమోదం తీసుకొని, 16వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా పనులు మొదలుపెట్టి, జూలై 14వరకు కొనసా గిం చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి మండలంలో దాదాపుగా రూ.2.50కోట్ల నుంచి రూ.5కోట్లకు పైగా పనులు చేపట్టే అవకాశం ఉంది. తుగ్గలి, ఆదోని, దేవనకొండ వంటి పెద్ద మండలాల్లో రూ.10-15 కోట్లు విలువైన పనులు చేపట్టే అవకాశం ఉందని డ్వామా అధికారి తెలిపారు.

చేపట్టాల్సిన పనులు

చెరువుల్లో పూడిక తీత, గట్టు బలోపేతం, ఫీడర్‌, ఫీల్డ్‌ ఛానల్స్‌ జంగిల్‌ క్లియరెన్స్‌, చెక్‌డ్యాంలో పూడికతీత, మరమ్మతులు. కొండ ప్రాంతాల్లో కాంటూరు కందకాల తవ్వకాలు.

రైతు పొలాల్లో ఫారం పాండ్స్‌, ప్రభుత్వ భూముల్లో డగౌట్‌ ఫా రం పాండ్స్‌ తవ్వకాలు, ఫారం పాండ్స్‌ ఫీడర్‌ ఛానల్స్‌ల్లో పూడికతీత పనులు. భూగర్భజలాలు పెంచేందుకు పనులు చేపట్టాలి.

కమిటీల్లో సభ్యులు వీరే:

జిల్లా కమిటీ: ఈ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్‌ ఉంటారు. వివిధ శాఖల సమన్వయ బాధ్యతలు జాయింట్‌ కలెక్టర్‌ చూస్తారు. డ్వామా పీడీ, జలవనరులు, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలు, గ్రౌం డ్‌వాటర్‌ డిపార్‌మెంట్‌ అధికారి, వ్యవసాయం, ఉద్యావనం, పశు సం వర్ధక శాఖల జేడీలు, డీఎఫ్‌వో, ప్రాజెక్టు కమిటీల చైర్మన్లు సభ్యులుగా ఉంటారు.

మండల కమిటీ: ఎంపీడీవో చైర్మన్‌గా ఉంటారు. జిల్లా కమి టీల్లో ఉండే వివిధ శాఖ మండల అధికారులు, ఉపాధి హామీ పథకం ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్స్‌, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ (ఈసీ), సాగునీటి సంఘాల ప్రతినిధులు సభ్యులు.

గ్రామ కమిటీ: పంచాయతీ డెవప్‌మెంట్‌ ఆఫీసర్‌ (పీడీవో) చైర్మన్‌గా ఉంటారు. స్వర్ణ సచివాలయంలో పనిచేసే విలేజ్‌ అగ్రిక ల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, అటవీ శాఖ సిబ్బంది, ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌, గ్రామ స్థాయిలో సాగునీటి సంఘాల చైర్మన్లు సభ్యులు.

ప్రమాదకరస్థాయికి..

భూగర్భ జలాలు (గ్రౌండ్‌ వాటర్‌) విభాగం అధికారులు ఇచ్చిన నివేదిక పరిశీలిస్తే కోసిగి మండలంలో ప్రమాదకర స్థాయికి భూగర్భ జలాలు పడిపోయాయి. భూమట్టం నుంచి 20మీటర్లు కంటే దిగువ (లోతు)కు పడిపోయాయి. ఆస్పరి, కల్లూరు, ఓర్వకల్లు, మద్దికెర, ఎమ్మిగనూరు మండలాల్లో 8-20మీటర్ల మధ్య లోతుకు భూగర్భ జలాలు చేరాయి. చిప్పగిరి, పెద్దకడబూరు మండలాల్లో 0-3 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉంటే, మిగిలిన మండలాల్లో 3-8 మీటర్ల లోతులో ఉన్నాయి. భూగర్భ నీటిలెక్కల్ని పరిగణలోకి తీసుకొని ఆయా మండలాల్లో భూగర్భజలాలు పెంచే పనులు చేపడుతారు. కోసిగి, ఆదోని, ఆస్పరి, కల్లూరు, ఓర్వకల్లు, మద్దికెర, ఎమ్మిగనూరు, మంత్రాలయం మండలాలపై ప్రత్యేక దృష్టికి కేంద్రీకరిస్తారు.

Updated Date - Apr 11 , 2026 | 11:33 PM