Share News

ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:19 AM

నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన
భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

డోన టౌన, జనవరి 9(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. మండలంలోని ఓబులాపురం గ్రామంలో అగ్రిసోల్డ్‌ ఇండియా పైవేటు లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధి సీహెచసీ నారాయణరెడ్డి, సీఎస్‌ఆర్‌ కోఆర్డినేటర్‌ సురేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటు తోపాటు రూ.65 లక్షలతో మంజూరైన సీసీ రోడ్లు, కల్వర్టు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. టీడీపీ నాయకుడు శేషిరెడ్డి పాల్గొన్నారు.

ఫ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్ర కాశ రెడ్డి అన్నారు. అనంతరం టీడీపీ పట్టణ కార్యాలయం వద్ద ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అలాగే తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసాత్రాలను ఎమ్మెల్యే కోట్ల అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వలసల రామకృష్ణ, కోట్రికే ఫణిరాజ్‌, లక్కసాగరం లక్ష్మిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు టీఈ రాఘవేంద్రగౌడు, కోట్రికే హరికిషన, జిల్లా ఉపాధ్య క్షుడు శ్రీనివాసులు యాదవ్‌, ఓబులాపురం శేషిరెడ్డి, వెంకటనారాయణ గౌడు, ఆలేబాదు పర మేష్‌, కమలాపురం సర్పంచ అర్జున రెడ్డి, పంచా యతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈలు గంగాధర్‌, రమేష్‌రెడ్డి, పీఆర్‌ ఏఈ నారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:20 AM