Share News

వ్యర్థాలను విభజించి ఇవ్వాలి

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:36 PM

నగర ప్రజలు తమ ఇంటి వద్దనే వ్యర్థాలను తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక వ్యర్థాలుగా వేర్వేరుగా విభజించి అందించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని కలెక్టర్‌ సిరి తెలిపారు.

వ్యర్థాలను విభజించి ఇవ్వాలి
అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ సిరి, కమిషనర్‌ ఓబులేసు

‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’లో కలెక్టర్‌ సిరి

కర్నూలు న్యూసిటీ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): నగర ప్రజలు తమ ఇంటి వద్దనే వ్యర్థాలను తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక వ్యర్థాలుగా వేర్వేరుగా విభజించి అందించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని కలెక్టర్‌ సిరి తెలిపారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌ కార్యక్రమంలో ఆర్డీవో సందీప్‌కుమార్‌, నగర పాలకసంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసుతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే బిర్లా కాంపౌండులో బల్క్‌ జనరేటర్‌ వద్ద ఉన్న వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. మద్దూర్‌ నగర్‌లో ఘన వ్యర్థ నిర్వహణ వ్యర్థాల విభజనపై స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు-2026 పోస్టరును ఆవిష్కరించారు. అనంతరం బిర్లా కాంపౌండులోని వాల్‌మార్ట్‌ ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న మురుగునీటి శుద్ధి కేంద్ర తడి వ్యర్థ ప్రాసెసింగ్‌ యూనిట్‌, ప్రమాదకర వ్యర్థ నిల్వ కేంద్రం, పునర్వినియోగ పొడి వ్యర్థ నిల్వ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం గార్గేయపురం డంప్‌ యార్డులోని విండ్రో కంపోస్టింగ్‌ యూనిట్లు, వర్మీ కంపోస్టింగ్‌ యూనిట్లు, మెటీరియల్‌ రివకరీ ఫెసిలిటీ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రోజుకు వంద కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు, బహుళ అతస్తుల భవనాలు, అపార్ట్‌మెట్లు, పెద్ద హోటళ్లు, ఆసుపత్రులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, విద్యాసంస్థలు, వ్యాపార సముదా యాలు తదితర సంస్థలు తమ వద్దే వ్యర్థాలను ప్రాసెస్‌ చేసే కంపో స్టుగా మార్చుకోవాన్నారు. కమిషనర్‌ చల్లా ఓబులేసు మాట్లాడుతూ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని, థర్డ్‌ పార్టీ రీసైక్లింగ్‌ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే ఈ వ్యవస్థను బల్క్‌ వేస్ట్‌ జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ ఎం.రఘు, ఎస్‌ఈ రమణమూర్తి, డీఈఈ పవన్‌కుమార్‌రెడ్డి, ఏఈ వైష్ణవి, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 11:36 PM