చెత్త 'కాలువ'
ABN , Publish Date - May 19 , 2026 | 12:22 AM
రైతుల జీవనాడి ఎస్సార్బీసీ వెంట చెత్తాచెదారం పడేస్తున్నారు. దీంతో ఈ చెత్త అంతా కాలువలోకి, అనంతరం అవుకు రిజర్వాయర్‌కు చేరుతోంది
బనగానపల్లె, మే 18. (ఆంధ్రజ్యోతి): రైతుల జీవనాడి ఎస్సార్బీసీ వెంట చెత్తాచెదారం పడేస్తున్నారు. దీంతో ఈ చెత్త అంతా కాలువలోకి, అనంతరం అవుకు రిజర్వాయర్‌కు చేరుతోంది. ఈ కాలువ ద్వారా పంటలకు సాగునీరు అలాగే పలు గ్రామాలకు మంచినీటి పథకాలకు నీటిని పంపుతున్నారు. కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల ప్రాంతాలకు కూడా ఈ నీరు ఆధాకరరం. కాల్వ వెంట ప్లాస్టిక్ పదార్థాలు, చికెన్ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు, పాత దుస్తులు, వెంట్రుకలు పడేస్తుండటంతో ఈ మార్గంలో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాలి. గ్రామ పంచాయతీ, ఎస్సార్బీసీ అధికారులు స్పందించి ఇక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.