'చెత్త ' వాగు..
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:31 AM
మండలం కేంద్రంలోని ఎర్రవాగు చెత్తాచెదారంతోనిఇండి దుర్వాసన వస్తోంది.
కొలిమిగుండ్ల, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): మండలం కేంద్రంలోని ఎర్రవాగు చెత్తాచెదారంతోనిఇండి దుర్వాసన వస్తోంది. ఇటువైపు ఆర్టీపీ బస్టాండ్ ప్రధాన రహదారి, అటువైపు ఎస్సీ కాలనీ ఉంది. అటు వాహనదారులు, ఇటు కాలనీవాసులు నిత్యం దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులు రోజూ చెత్తసేకరణ చేయకపోవడంతో ఇలా వాగులో వేస్తున్నారని, ఇప్పటికైనా స్పందించి చెత్తసేకరణకు ఏర్పాట్లు చేసయాలని, వాగును శుద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.