Share News

విలువైన నీరు వృథా..

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:16 AM

మండలంలో శుక్రవారం రాత్రి, శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. 49.2 ఎంఎం వర్షపాతం శనివారం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు.

విలువైన నీరు వృథా..
రద్రరవరం పెదరాజచెరువు నుంచి వెళుతున్న నీరు

చేపలు పట్టేందుకు చెరువులోని నీరు విడుదల చేసిన అక్రమార్కులు

కళ్లు మూసుకున్న ఎంఐ అధికారులు

రుద్రవరం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మండలంలో శుక్రవారం రాత్రి, శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. 49.2 ఎంఎం వర్షపాతం శనివారం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు. అయితే చేపల వ్యాపారులు చెరువుల నుంచి ఎటువంటి అనుమతి లేకుండా నీటిని విడుదల చేశారు. ఈ దందాను అరికట్టాల్సిన ఎంఐ అధికారులు పట్టించుకోవం లేదు. కొండమాయపల్లె చినరాజచెరువు రుద్రవరం పెదరాజచెరువు తూములను చేపలు పట్టే క్రమంలో ఎత్తేసి నీరు బయటికి వదలేశారు. ఇప్పటికే వర్షాలు లేక పొలాలు ఎండిపోతుండా ఇలా వర్ఫను నీటిని వదిలేస్తుంటా అధికారులు ఏం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తరచుగా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా స్పందించి నీరు వృథా కాకుండా ఆపాలని కోరుతున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:16 AM