ఎక్కడి చెత్తకుప్పలు అక్కడే
ABN , Publish Date - May 11 , 2026 | 12:06 AM
ప్రతి నిత్యం వేలాది బస్తాల పంట ఉత్పత్తులు క్రయవిక్రయాలు జరిగే వ్యవసాయ మార్కెట్ పరిశుభ్రతకు నోచుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శుభ్రతకు నోచుకోని మార్కెట్ యార్డు ప్రాంగణం
పట్టించుకోని అధికారులు ట
ఎమ్మిగనూరు, మే10 (ఆంధ్రజ్యోతి): ప్రతి నిత్యం వేలాది బస్తాల పంట ఉత్పత్తులు క్రయవిక్రయాలు జరిగే వ్యవసాయ మార్కెట్ పరిశుభ్రతకు నోచుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ యార్డు ఆవరణంలో చెత్త, మట్టి కుప్పలు ఎక్కడికక్కడే ఉండిపోతున్నాయి. వాటిని తరలించాల్సిన కాంట్రాక్టరు పట్టించ ుకోవడం లేదు. మార్కెట్ ఆవరణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉండగా పట్టించుకోకపోవటంతో ప్లాట్ ఫారంపై చెత్తకుప్పలు అలాగే ఉండిపోతున్నాయి. అజంబో షెడ్ దగ్గర పిల్లర్స్ దగ్గర మట్టి కుప్పలు పేరుకుపోగా, పాత షెడ్ పక్కన చెత్తకుప్పలు అలాగే ఉండిపోయాయి. కాటాదారుల విశ్రాంతి భవనం ముందు చెత్తాచెదారం పేరుకుపోయింది. ఆ భవనం వెనుక ఉన్న తాగునీటి కుళాయి చట్టు దర్గందం వెదజల్లుతోంది. దాని ఎదురుగా ఉన్న టెండర్ హాల్ కింద దుకాణాల ముందు కూరగాయల వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. మార్కెట్ ఆవరణంలో చెత్త వేసేందుకు ఏర్పాటుచేసిన చెత్తకుండీ ధ్వంసమైంది. రోజులు గడుస్తున్నా మరమ్మతు లకు నోచుకోవటం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవటం, సిబ్బంది పట్టించుకోక పోవటంతో మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈవిషయంపై మార్కెట్ ప్రత్యేకశ్రేణి కార్య దర్శిని వివరణ కోరగా క్లీనింగ్ కాంట్రాక్టర్ సక్రమంగా శుభ్రం చేయకపోవటంతో బిల్లులు నిలిపివేశామన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వాస్పత్రిలో పేరుకుపోయిన చెత్త
ఎమ్మిగనూరు టౌన్: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పారిశుధ్యం పడకేసింది. ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో చెత్త పేరుకుపోయింది. రోగులకు బెడ్ కింద వేసిన కవర్లు చెత్త కుండీ పక్కన పడి ఉండడం గమనార్హం. చెత్త కారణంగా దోమల స్వైరవిహారం చేయడంతో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంంటి వ్యాధులు ఎక్కడ ప్రబలుతాయోనని రోగులు భయపడుతున్నారు. కుక్కలు ఆస్పత్రి ఆవరణలోకి వస్తుండటంతో రోగులు, వారి బంధువులు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి ఆస్పత్రిలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు.