మిర్చి వ్యాపారులకు హెచ్చరిక
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:45 PM
కర్నూలు మార్కెట్ యార్డులో ఒక్క రైతును కూడా మోసం చేయడానికి లేదని కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులను మార్కెట్ కమిటీ చైర్మన్ గోల్కొండ అజ్మిత్‌బీ, వైస్ చైర్మన్ శేషగిరిశెట్టి హెచ్చరించారు.
ప్లాట్ ఫారాల్లో మొదటి ప్రాధాన్యత రైతులకే
సీలు లేని తూకాలు వాడితే చర్యలు
మార్కెట్ కమిటీ చైర్మన్ గోల్కొండ అజ్మిత్‌బీ
కర్నూలు అగ్రికల్చర్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్ యార్డులో ఒక్క రైతును కూడా మోసం చేయడానికి లేదని కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులను మార్కెట్ కమిటీ చైర్మన్ గోల్కొండ అజ్మిత్‌బీ, వైస్ చైర్మన్ శేషగిరిశెట్టి హెచ్చరించారు. ఆంధ్రజ్యోతిలో ప్రచు రించిన మిర్చి రైతులు దగా అన్న వార్తకు పాలకవర్గం, అధికారులు స్పందించారు. సోమవారం కర్నూలు మిర్చి యార్డుకు పాలకవర్గంతో పాటు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి, అసిస్టెంట్ సెక్రటరీ వెంక టేశ్వర్లు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, నాగేష్, శివన్న తదితరులు మిర్చి అమ్మకాలు జరిగే ప్లాట్‌ఫారాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్ ఫారాల్లో మొదటి ప్రాధాన్యతగా రైతులు తెచ్చిన ఉత్పత్తులకే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత స్థలాలు ఖాళీగా ఉంటే వ్యాపారులు వాడుకోవచ్చని, అది కూడా ఒకట్రెండు రోజుల్లోనే ఇతర ప్రాంతాలకు మిర్చి నిల్వలను తరలించాలని స్పష్టం చేశారు. రైతులు తెచ్చిన మిర్చి బస్తాలను కాటాలపై తూకం వేయించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి వ్యాపారులతో మాట్లా డుతూ తూకాలు సక్రమంగా ఉండాలని, సీలు లేని తూకాలు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. చైర్మన్ అజ్మిత్‌బీ మాట్లాడుతూ రైతులను అన్యాయం చేస్తే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డైరెక్టర్లు మారుతి శర్మ, సువార్తమ్మ, ఏసన్న, పవన్ కుమార్, శ్రీధర్ పాల్గొన్నారు.
అక్రమాలకు పాల్పడిన కమిషన్ ఏజెంట్లపై చర్యలు
కర్నూలు మార్కెట్ యార్డులో గత కొన్ని రోజుల క్రితం శ్రీకృష్ణవేణి ట్రేడర్స్ కమిషన్ ఏజెంట్ మద్దిలేటి రైతుల పంట ఉత్పత్తులను సీలు లేని కాటాలో తూకం వేసినందుకు అతని లైసెన్సును పదిహేను రోజులు సస్పెండ్ చేసినట్లు చైర్మన్ గోల్కొండ అజ్మిత్‌బీ తెలిపారు. అదే విదంగా హమాలీలు షేక్షావలి, సేవాగ్‌లను 15 దినాలు పనికి రాకుండా సస్పెండ్ చేసినట్లు తెలిపారు.