Share News

శనగ పంటపైపచ్చ పురుగు దాడి

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:24 AM

రబీలో సాగు చేసిన శనగ పంటపై పచ్చపురుగు దాడిచేస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్‌లొ మండలంలోని ఓర్వకల్లు, హుశేనాపురం, గుట్టపాడు, ఎన్‌.కొంతల పాడు, నన్నూరు, ఉయ్యాలవాడ, లొద్దిపల్లె, కన్న మడకల, పూడిచెర్ల, తిప్పాయపల్లె తదితర గ్రామాల్లో దాదాపు 7వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు.

శనగ పంటపైపచ్చ పురుగు దాడి
పంటకు పురుగు మందు పిచికారీ చేస్తున్న రెతు

ఆకులను తినేస్తున్న పురుగు

దిగుబడి రాదని రైతుల ఆందోళన

ఓర్వకల్లు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రబీలో సాగు చేసిన శనగ పంటపై పచ్చపురుగు దాడిచేస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్‌లొ మండలంలోని ఓర్వకల్లు, హుశేనాపురం, గుట్టపాడు, ఎన్‌.కొంతల పాడు, నన్నూరు, ఉయ్యాలవాడ, లొద్దిపల్లె, కన్న మడకల, పూడిచెర్ల, తిప్పాయపల్లె తదితర గ్రామాల్లో దాదాపు 7వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు.

పచ్చపురుగు ప్రభావంతో..

శనగ ప్రస్తుతం కాయ దశలో ఉంది. దిగుబడి వచ్చే సమయంలో పచ్చపురుగు ఉధృతి పెరగడంతో పాలు తగ్గుతుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. పురుగు ఉధృతి పెరగడంతో పంట దెబ్బతిని, దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు భయపడు తున్నారు. అలాగే పొగ మంచు అధికం కావడంతో పూత రాలిపోతోందని ఆవేదన చెందుతున్నారు.

దిగుబడి తగ్గే ప్రమాదం

శనగలో ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. అయితే పురుగు, పొగ మంచు ఎకరాకు 3 నుంచి 5 క్వింటాల్లు మాత్రమే వచ్చేలా ఉందని ఉందని ఆందోళన చెందుతున్నారు.

అదుపులోకి రాని పురుగు..

పురుగు నివారణకు ఇప్పటికే పలురకాల పురుగు మందులను పిచికారీ చేశామని, అయినా అదుపులోకి రాలేదని రైతులు అంటున్నారు. పంట సాగు చేసినప్పటి నుంచి వర్షాలు అధికం కావడంతో తెగుళ్లు వ్యాపించాయంటున్నారు.

పురుగు దెబ్బతో నష్టపోయాం

అయిదెకరాల్లో శనగ సాగుచేశా, ఎకరాకు రూ.10వేలు ఖర్చయింది. పచ్చ పురుగు సోకడంతో పురుగు మందులు వాడేందుకు ఖర్చులు పెరిగాయి. ఎన్నిమందులు వాడినా పురుగు అదుపులోకి రాలేదు. - తిరుపాలు, రైతు, పూడిచెర్ల

సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి

పురుగు నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. లీటరు నీటికి 3 మి.మీల ఎండోసోల్ఫాన్‌ ద్రావణం, దీంతో పాటు వేప నూనె 5 మి.మీలు లేదా పాస్పేట్‌ లీటరు నీటితో కలిపి మొక్కలపై ఉదయం, సాయంత్రం పిచికారీ చేయాలి. లేదా క్లోరోపైరీఫాస్‌ 2 మి.మీల ద్రావణం లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి. వీటితోపాటు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు, 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే పురుగును నివారించవచ్చు. - మధుమతి, ఏవో

Updated Date - Jan 06 , 2026 | 01:24 AM