Share News

తహసీల్దార్‌ కావలెను?

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:46 PM

మండలానికి వచ్చే తహసీల్దార్లు వెంటనే సెలవులో వెళ్లిపోవడం ఆనవాయితీగా మారింది.

తహసీల్దార్‌ కావలెను?

సెలవులో ప్రస్తుత తహసీల్దార్‌, ఏడాదిన్నరలోనే ఆరుగురు మార్పు

అవస్థలు పడుతున్న విద్యార్థులు, ప్రజలు

కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మండలానికి వచ్చే తహసీల్దార్లు వెంటనే సెలవులో వెళ్లిపోవడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత తహసీల్దార్‌ జయప్రసాద్‌ వచ్చీరాగానే సెలవులో వెళ్లిపోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఇన్‌చార్జిగా పనిచేసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని సమాచారం.

ఇబ్బందులు పడుతున్న ప్రజలు, విద్యార్థులు..

పది రోజులుగా తహసీల్దార్‌ సెలవులో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కార్యాలయానికి వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం నీట్‌, ఎంసెట్‌, ఏపీ రెసిడెన్షియల్‌, గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు చేసే సమయం కాడవంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అలాగే రైతుల సేవలకు, పాస్‌ పుస్తకాల పంపిణీకి కూడా ఆటంకం కలుగుతోంది. కాగా గత వైసీపీ హయాంలో తీవ్ర వివాదాల కారణంగా తహసీల్దార్‌గా విధులు నిర్వహించడానికి ఎవ్వరూ ఆసక్తి చూపడంలేదని సమాచారం. ఏడాదిన్నర కాలంలోనే ఆరుమంది తహసీల్దార్లు మారారంటే పరిస్థితి అర్థమవుతుంది. రెవెన్యూ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు.

Updated Date - Feb 19 , 2026 | 11:46 PM