ఇంధన పొదుపులో భాగం కావాలి
ABN , Publish Date - May 19 , 2026 | 11:27 PM
ఇంధన పొదుపులో అందరూ భాగం కావాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
ఆర్టీసీ బస్సులో ప్రయాణం
కోడుమూరు రూరల్ మే 19 (ఆంధ్రజ్యోతి): ఇంధన పొదుపులో అందరూ భాగం కావాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తన స్వగ్రామం లద్దగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్‌కు ఎమ్మెల్యే కోట్ల బస్సు ప్రయాణం చేశారు. కోట్ల తన నివాసం నుంచి బస్టాండుకు కాలి నడకన చేరుకున్నారు. అక్కడ బస్సు కోసం నిలబడ్డారు. అదే సమయంలో బస్సు రావడంతో కోట్ల అందులోకి ఎక్కి చట్టసభల ప్రజాప్రతినిధులకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. కండక్టర్‌తో టికెట్ కొనుగోలు చేశారు. ఆయనతో పాటు భద్రతా సిబ్బంది బస్సు ప్రయాణం చేశారు. కోట్ల మాట్లాడుతూ పీఎం మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా బస్సు ప్రయాణం చేసినట్లు తెలిపారు. ఇది ఎంతో మంచి కార్యక్రమమని, అనవసర ఖర్చును తగ్గించుకుంటే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుం దన్నారు.