Share News

ఏవీ కాంప్లెక్స్‌ వద్ద గోడ నిర్మాణం

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:46 AM

పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీంలో ఉన్న ఏవీ కాంప్లెక్స్‌ వద్ద శనివారం కోర్టు ఇంజక్షన్‌ ఉత్తర్వుల మేరకు మాజీ ఆర్‌ఐసీ ఛైర్మెన్‌ ఏవి సుబ్బారెడ్డి గోడను నిర్మించారు.

 ఏవీ కాంప్లెక్స్‌ వద్ద గోడ నిర్మాణం
ఏవీ కాంప్లెక్స్‌ వద్ద నిర్మిస్తున్న గోడ

ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీంలో ఉన్న ఏవీ కాంప్లెక్స్‌ వద్ద శనివారం కోర్టు ఇంజక్షన్‌ ఉత్తర్వుల మేరకు మాజీ ఆర్‌ఐసీ ఛైర్మెన్‌ ఏవి సుబ్బారెడ్డి గోడను నిర్మించారు. ఇటీవలే గోడ తొలగించాలని కాలనీ పర్యటనలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను కాలనీవాసులు కోరారు. ఈనెల 2న మున్సిపల్‌ అధికారులు గోడను తొలగించడంతో ఉద్రిక్తలకు దారి తీసింది. పోలీసులు ఏవి సుబ్బారెడ్డికి సర్దిచెప్పి, అధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వాలన్నారు. దీంతో ఏవీ సుబ్బారెడ్డి కోర్టు ను ఆశ్రంచి ఇంజక్షన్‌ ఉత్తర్వులను పొంది, గోడ నిర్మాణం చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ గోడ కడుతున్నట్లు తనక తెలియదని, కోర్టు ఉత్తర్వులు కూడ తనకు అందలేదనడం కోసమెరుపు.

Updated Date - Feb 15 , 2026 | 12:46 AM