Share News

వాటర్‌ ట్యాంకు రాక కోసం..

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:13 AM

మండలంలోని జలదుర్గం గ్రామం కొత్తకొట్టాల కాలనీలో మూడు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.

వాటర్‌ ట్యాంకు రాక కోసం..
ట్యాంకర్‌ కోసం ఎదురు చూస్తున్న మహిళలు

జలదుర్గంలో ప్రజల పడిగాపులు

పైపులైన్‌ లీకేజీతో ఆగిన సరఫరా

ప్యాపిలి, జూన్7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జలదుర్గం గ్రామం కొత్తకొట్టాల కాలనీలో మూడు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. 200 ఇళ్లు ఉండగా, సమీపంలోని గొల్లపల్లి బుగ్గ నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారు. మూడు నెలల క్రితం తాగునీటి పథకానికి సంబంధించిన పైపులు దెబ్బతినడంతో సరఫరా నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారని, అవి సరిపడటం లేదని ప్రజలు వాపోతున్నారు. ట్యాంకర్‌ ఎప్పుడొచ్చేదీ తెలియక పనులు వదిలేసి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందెడు నీటి కోసం ఘర్షణకు దిగాల్సి వస్తుందని గగ్గోలు పెడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Jun 08 , 2026 | 12:13 AM