పింఛన్ కోసం ఎదురుచూపులు
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:36 AM
నూతన పింఛన్ల సోకం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 నవంబర్ నుంచి ప్రభుత్వం నూతన పింఛన్లు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మండలంలో దాదాపు 2వేలమంది పింఛన్‌కోసం ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ను ప్రభుత్వం మూసివేయడంతో అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
2019 నుంచి నూతన పింఛన్లు లేవు.. పని చేయని వెబ్‌సైట్
కొలిమిగుండ్ల, జూలై 30 (ఆంఽధ్రజ్యోతి): నూతన పింఛన్ల సోకం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 నవంబర్ నుంచి ప్రభుత్వం నూతన పింఛన్లు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మండలంలో దాదాపు 2వేలమంది పింఛన్‌కోసం ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ను ప్రభుత్వం మూసివేయడంతో అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
భారంగా మారిన జీవితం
నూతన పింఛన్లు మంజూరు కాకపోవడంతో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు జీవితం భారంగా మారింది. మండలంలో వందలాది మంది ఫించన్లు ఎప్పుడు వస్తాయా? అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. రెండున్నర సంవత్సరాల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు వెబ్‌సైట్ మూసివేయడంతో ఆవేదన చెందుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ముందైనా...
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్‌లో మున్సిపల్, పంచాయ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న సమాచారంతో ఆశాజీవులు ఎదురుచూస్తున్నారు. వైబ్‌సైట్ తిరిగి ప్రారంభింస్తారని రెండు, మూడు నెలల నుంచి పార్టీ నాయకులు హడావిడి చేస్తున్నా ఇప్పటికైతే సమచారం లేదు.
పింఛన్ కోసం ఎదురుచూస్తున్నా..
నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు, నడుములు దెబ్బతిని దివ్యాంగుడిగా మారాను. దివ్యాంగ సర్టిఫికెట్ తెచ్చుకునేలోపు ప్రభుత్వం మారటంతో ఫించన్ వెబ్‌సైట్ మూసివేశారు. దీంతో ఫించన్ కోసం ఎదురు చూస్తున్నాను. - ప్రభాకర్, దివ్యాంగుడు, కొలిమిగుండ్ల