సమానంగా వేతనాలు పెంచాలి
ABN , Publish Date - May 21 , 2026 | 10:49 PM
ఉద్యోగులందరికీ సమా నంగా వేతనాలు పెంచాలని కోరుతూ పట్టణంలోని ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం ఉద్యోగులు గురువారం నుంచి సమ్మె చేపట్టారు.
చేనేత సహకార సంఘం ఉద్యోగుల సమ్మె
మద్దతు తెలిపిన సీఐటీయూ
ఎమ్మిగనూరు, మే 21 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులందరికీ సమా నంగా వేతనాలు పెంచాలని కోరుతూ పట్టణంలోని ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం ఉద్యోగులు గురువారం నుంచి సమ్మె చేపట్టారు. ఈనెల 15న వేతనాలు పెంచాలని ఉన్నతాధికారులకు సమ్మె నోటుసు ఇచ్చారు. అయితే వారినుంచి ఎలాంటి హామీ లేకపోవటంతో ఉద్యోగులు మూకుమ్మడిగా సమ్మెలోకి వెళ్లారు. వైడబ్ల్యుసీఎస్ ప్రధాన కార్యాలయం గేటు ముందు బైఠాయించి వేతనాలు పెంచాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ సంఘంలో 5ఏళ్ల నుంచి 38 ఏళ్లు అనుభవంగల ఉద్యోగులు పని చేస్తున్నామన్నారు. పదో తరగతి నుంచి పీజీ చదివిన విద్యార్హత ఉన్నావారు సంఘంలో పనిచేస్తున్నారని తెలిపారు. అయితే రెండు మూడేళ్ల క్రితం విధుల్లోకి చేరిన ఒకరికి మాత్రమే వేతనం పెంచి మిగతా వారిని విస్మరించటం సరైందికాదన్నారు. అందరికీ 50శాతం వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉద్యోగులు వీరేష్ కుమార్, సూగూరప్ప, మాసుం వలి, రిజ్వాన, రఘునాథ్, గోవిందు, బండా గోపి, ఆదేప్ప, శంకరయ్య, గోపాల్, సత్యనారాయణ గౌడోలతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
వైడబ్ల్యుసీఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు వేతనాలు పెంచాలని ఈ నెల 15న కలెక్టర్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారులకు వివరించాం. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఉద్యోగులకు చెప్పినా వారు సహకరించటం లేదు. ్ఙ
-ఏడీహెచ్ నాగరాజ రావు
వైడబ్ల్యుసీఎస్ ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మద్దతు
వేతనాలు పెంచాలని కోరుతూ సమ్మె చేస్తున్న వైడబ్ల్యుసీఎస్ ఉద్యోగులకు సమ్మెకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ, స్థానిక నాయకులు గోవిందు, రాముడు, చేనేత కార్మిక సంఘం నాయకులు కాళప్ప మద్దతు తెలిపారు.