Share News

వేతనాలు పెంచాలి

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:24 PM

రాష్ట్రంలోని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌కు తక్షణమే వేతనాలు పెంచాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే. లలిత డిమాండ్‌ చేశారు.

వేతనాలు పెంచాలి
ధర్నాలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత

అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత

కర్నూలు న్యూసిటీ, జూలై 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌కు తక్షణమే వేతనాలు పెంచాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే. లలిత డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎఉట ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ టీచర్స్‌, హెల్పర్స్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు జి. చంద్రశేఖర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలలో పని ఒత్తిడికి తట్టుకోలేక వర్కర్లు అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ఉన్నతాధి కారులు పదే పదే మెసేజ్‌లు పెట్టడం వల్ల పని ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌. మునెప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు, అసోసియేషన్‌ నాయకులు చౌడేశ్వరి, కాంతమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 11:24 PM