ఏసీబీ వలలో వీఆర్వో
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:37 PM
: ఏసీబీ వలకు రెవెన్యూ శాఖకు చెందిన ఓ అవినీతి చేప చిక్కింది. రూ.25వేలు లంచం తీసుకుం టూ ఉడుములపాడుకు చెందిన వీఆర్వో పట్టుబడ్డాడు.
రూ.25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఉద్యోగి
డోన్ టౌన్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఏసీబీ వలకు రెవెన్యూ శాఖకు చెందిన ఓ అవినీతి చేప చిక్కింది. రూ.25వేలు లంచం తీసుకుం టూ ఉడుములపాడుకు చెందిన వీఆర్వో పట్టుబడ్డాడు. వివరాలు.. మండలంలోని జగదుర్తికి చెందిన గుర్రం నాగేం ద్రుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టణంలోని కంబాలపాడు రోడ్డులోని ఓ హెయిర్‌స్టైల్ షాపులో మధ్యవర్తి వలసల గ్రామానికి చెంది న బోయ రమణ రూ.25వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. జగదుర్తికి చెందిన గుర్రపు నాగేంద్రు డు పొలం సర్వే. నెంబర్.114/సీ1 లో 85 సెంట్లు, మరో సర్వేనెంబ రులో 14 సెంట్లు మొత్తం 99 సెంట్లను బాధితుడి తల్లి పేరుమీద ఉంది. ఈపొలాన్ని తన పేరు మీద ఆన్‌లై న్‌లో ఎక్కిం చడానికి వీఆర్వో లాలెప్పను నాగేంద్రుడు సంప్రదిం చాడు. దీనికి వీఆర్వో రూ.25వేలు డిమాండ్ చేశాడు. ఈమొత్తాన్ని ఇచ్చుకోలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆదేశాల మేరకు అధికా రులు వలపన్ని శని వారం రాత్రి రూ.25వేలు లంచం తీసు కుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వో లాలెప్పను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈదాడుల్లో ఏసీబీ సీఐలు కృష్ణయ్య, రాజా ప్రబాకర్, శ్రీనివాసులు, ఎస్‌ఐ సుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు.