ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను వెంటనే అందజేయాలి
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:55 PM
ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను వెంటనే అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి కోరారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మంది రంలో శనివారం జేసీ నూరుల్ ఖమర్‌తో కలిసి సమావేశం నిర్వహించి జరుగుతున్న ప్రక్రియను వివరించారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి
కర్నూలు కలెక్టరేట్, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను వెంటనే అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి కోరారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మంది రంలో శనివారం జేసీ నూరుల్ ఖమర్‌తో కలిసి సమావేశం నిర్వహించి జరుగుతున్న ప్రక్రియను వివరించారు. జిల్లా ఎన్నికల అధికారి విలేక రులతో మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్లు 20,86,000 మంది ఉన్నారని, ఇప్పటి వరకు 17,16,351 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. 82.27 శాతం పూర్తయిందని చెప్పారు. ఇంకా 3,69,768 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉందని చెప్పారు. డిజిటలైజేషన్ ఎన్యుమరేష్ ఫామ్స్‌లో ఓటరు సంవత్సరం 2002లో ఉండొచ్చని, 2002 తర్వాత, ప్రస్తుతం కొత్తగా ఓటరు అయి ఉండొచ్చని, వీరందరినీ మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. 98.5 శాతం ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని తెలిపారు.