Share News

ఓటర్ల జాబితా విడుదల

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:16 AM

కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌)’ ప్రక్రియ శనివారం రాత్రి 8 గంటలకు ముగిసింది. జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

     ఓటర్ల జాబితా విడుదల

తిరిగి రాని ఫారాలు 2.73 లక్షలు

వారు ఓటు హక్కు కోల్పోయినట్లేనా..?

కర్నూలు జిల్లాలో మరణించిన ఓటర్ల సంఖ్య 65,311

శాశ్వతంగా వలస వెళ్లిన 75,660 ఓటర్లు

డూప్లికేట్‌ ఓటర్లు 60,592 మంది

ముగిసిన సర్‌ ప్రక్రియ.. ఈ నెల 31న ముసాయిదా

కర్నూలు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌)’ ప్రక్రియ శనివారం రాత్రి 8 గంటలకు ముగిసింది. జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సర్‌ ప్రక్రియ ప్రారంభించే నాటికి 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికి బీఎల్‌వోలు 20,86,119 ఓటర్లకు (వందశాతం) ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేశారు. డిజిటలైజేషన్‌ కూడా వంద శాతం పూర్తి చేశారు. అయితే.. జిల్లాలో పంపిణీ చేసిన ఎన్యుమరేషన్‌ ఫారాల్లో 18,12,197 ఫారాలే బీఎల్‌వోలకు తిరిగి వచ్చాయి. 2,73,922 ఫారాలు తిరిగి రాలేదు. ఈ నెల 31న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యే అకాశాలు ఉన్నాయని ఎన్నికల అధికారులు అంటున్నారు. తిరిగి రాని ఫారాల్లో మరణించిన (డెత్‌) ఓటర్లు 65,311, శాశ్వతంగా వలస వెళ్లిన (పర్మనెంట్‌ ఫిఫ్టెడ్‌) ఓటర్లు 75,660, ఒకే వ్యక్తి రెండు అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్నవారు (డూప్లికేట్‌) ఓటర్లు 60,592, గుర్తించలేని/ఆబ్సెంట్‌ అయిన ఓటర్లు 71,505, ఇతరులు 854 మంది ఉన్నారు. వీరిలో పర్మనెంట్‌గా సిఫ్ట్‌ అయిన వారు, గుర్తించలేని ఓటర్లు ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్నా.. ఎన్యుమరేషన్‌ ఫారాలు తిరిగి ఇవ్వకపోవడంతో వారి ఓటు జబితాలో ఉండకపోవచ్చని అంటున్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:16 AM