భవిష్యత్తు నిర్ణేతలు ఓటర్లే
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:36 PM
ప్రజాస్వామ్యంలో భవిష్యత్తు నిర్ణేతలు ఓటర్లేనని, రాజ్యాంగం కల్పినంచిన శక్తివంతమైన ఆయుధం ఓటేనని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు
కర్నూలు ఆర్‌వో, కమిషనర్ పి.విశ్వనాథ్
నగరంలో ఓటరు దినోత్సవం
కర్నూలు న్యూసిటీ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో భవిష్యత్తు నిర్ణేతలు ఓటర్లేనని, రాజ్యాంగం కల్పినంచిన శక్తివంతమైన ఆయుధం ఓటేనని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ర్యాలీ నిర్వహించి, రాజవిహార్ వద్ద ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. విధుల్లో ప్రతిభ చూపిని నలుగురు బీఎల్‌ఓలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపి అందజేశారు. ధనిక-పేద తేడా లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందన్నారు. ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించాలన్నారు. ఓటును అమ్ముకుంటే భవిష్యత్తు అంధకారమవుతుందని, నిజాయితీగా ఓటు వేసినప్పుడే ఓటుకు సార్ధకతమ చేకూరు తుందని ఆర్‌వో తెలిపారు. అసిస్టెంట్ ఆర్‌వో, అర్బన్ తహసీల్దారు రవికుమార్, డీసీ సతీ్‌షకుమార్ రెడ్డి, డీటీ ధనుంజయ, ఎస్‌ఈ జే.రమణమూర్తి, సీఐ మన్సూరుద్దీన్, సూపరింటెండెంట్ సుబ్బన్న ఉన్నారు.
బాధితులకు టీడీఆర్ బాండ్లు అందజేత..
ప్రజలు సహకరిస్తేనే నగరాభివృద్ధి సాధ్యమని వేగంగా నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో నగర పరిధలో ఎన్‌హెచ్ 340సీ జాతీయ రహదారి విస్తరణలో స్థలం కోల్పోయిన ముగ్గురు బాధితులకు నాలుగు ట్రాన్స్‌ఫరబుల్ డెవల్‌పమెంట్ రైట్స్(టీడీఆర్)బాండ్లను పంపిణీ చేశారు. దామోదరం సంజీవయ్య కూడలి నుంచి నందికొట్కూరు రోడ్డులో నగర పరిధిలో 2.34 కిలోమీటర్ల మేర 100 అడుగులకు రహదారిని విస్తరించనున్నట్లు తెలిపారు.