రూ.14.6 కోట్లతో విశ్రమ్ సదన
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:01 AM
స్టేట్ క్యాన్సర్ ఇనస్టిట్యూట్ సమీపంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన సీఎస్‌ఆర్ రూ.14.6 కోట్ల నిధులతో 150 పడకలతో రోగుల సహాయకుల వసతి భవనాన్ని 18 నెలల్లో పూర్తిచేయాలని జీజీహెచ సూపరింటెండెంట్ డా.కే.వెంక టేశ్వర్లు ఆదేశించారు.
జీజీహెచ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): స్టేట్ క్యాన్సర్ ఇనస్టిట్యూట్ సమీపంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన సీఎస్‌ఆర్ రూ.14.6 కోట్ల నిధులతో 150 పడకలతో రోగుల సహాయకుల వసతి భవనాన్ని 18 నెలల్లో పూర్తిచేయాలని జీజీహెచ సూపరింటెండెంట్ డా.కే.వెంక టేశ్వర్లు ఆదేశించారు. శనివారం ఆయన చాంబరులో విశ్రమ్ సదన ప్రాజెక్టుపై పవర్ గ్రిడ్, ఎనబీసీసీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ఏడాది నవంబరు 25న ప్రాథమిక చర్చలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం పనుల పురోగతి పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ కర్నూలు జీజీహె చకు ఏడు, ఎనిమిది జిల్లాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి రోగు లు వస్తుంటారని ఆస్పత్రి ఆవరణలో సురక్షితమైన వసతి కల్పిం చడమే విశ్రమ్ సదన ఉద్దేశమన్నారు. భవనం పూర్తయిన తర్వాత వసతి పొందే రోగులు సహాయకులు వివరాలను ఎప్పటిక్పుడు నమో దు చేసుకునే పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తామన్నారు.