Share News

శ్రీశైలంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

ABN , Publish Date - May 29 , 2026 | 12:09 AM

శ్రీశైల క్షేత్ర సందర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉన్నందున దర్శన విధానాల్లో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

శ్రీశైలంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

శ్రీశైలం, మే 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్ర సందర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉన్నందున దర్శన విధానాల్లో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానంగా సిఫార్సులతో అప్పటికప్పుడు వచ్చే ప్రొటోకాల్‌ వీఐపీ బ్రేక్‌ స్పర్శ దర్శన టిక్కెట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నేటి నుంచి జూన్‌ 1వ తేది వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు పూర్తిగా నిలిపివేసి అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నట్లు చెప్పారు.

Updated Date - May 29 , 2026 | 12:09 AM