Share News

విద్యుత ప్రమాదాలపై అప్రమత్తత అవసరం

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:23 AM

ప్రస్తుత వర్షాకా లంలో విద్యుత ప్రమాదాలపై అప్రమత్తత ఎంతో అవసరమని విద్యుత శాఖ ఏడీఈ నాగప్రసాద్‌, ఏఈ సతీష్‌ సూచించారు.

విద్యుత ప్రమాదాలపై అప్రమత్తత అవసరం
మాట్లాడుతున్న ఏడీఈ నాగప్రసాద్‌

కర్నూలు కల్చరల్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వర్షాకా లంలో విద్యుత ప్రమాదాలపై అప్రమత్తత ఎంతో అవసరమని విద్యుత శాఖ ఏడీఈ నాగప్రసాద్‌, ఏఈ సతీష్‌ సూచించారు. గురు వారం రాత్రి నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో విద్యుత ప్రమాదాల నివారణ అనే అంశంపై స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వర్షాకాలంలో విద్యు త పోయినా, నిలిచిపోయినా సంబంధిత అధికారులకు సమాచార మివ్వాలని సూచించారు. విద్యుత మరమ్మతు పనులను కూడా సంబంధిత నిపుణుల ద్వారానే చేయించాలని, తెలిసీ తెలియకుండా విద్యుత పనులను చేయకూడదని తెలిపారు. కార్యక్రమంలో రోజా మహిళా ఐక్య సంఘం సభ్యులతోపాటూ స్థానిక ప్రజలు పాల్గొని అధికారుల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Updated Date - Jul 10 , 2026 | 12:23 AM