Share News

పాల కేంద్రాల్లో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:43 PM

ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాల ఘటనతో విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమ య్యారు.

పాల కేంద్రాల్లో విజిలెన్స్‌ తనిఖీలు
మిల్క్‌ డైరీలో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

కర్నూలు అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాల ఘటనతో విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమ య్యారు. గురువారం కర్నూలు నగరంలోని విజయ పాల విక్రయ కేంద్రాలతో పాటు వివిధ పాల తయారీ కేంద్రాల్లో విజిలెన్స్‌ సీఐ పవన్‌ కుమార్‌, ఆహార కల్తీ నియంత్రణ అధికారి రాజ్‌గోపాల్‌ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి, వెంకటేశ్వర మిల్క్‌ దుకాణంతో పాటు ఎల్‌వీ రెడ్డి, బీఎన్‌ రెడ్డి డెయిరీ ఫామ్‌, కర్నూలు జిల్లా మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ దుకాణాల్లో తనిఖీలు చేశారు. శాంపిల్స్‌ సేకరించి చెన్నై నిర్ధారణ పరీక్ష కేంద్రానికి తరలించామని విజిలెన్స్‌ సీఐ పవన్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Feb 26 , 2026 | 11:43 PM