విజిలెన్స్ అధికారుల దాడులు
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:16 AM
గూటుపల్లె గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్దంగా ఇనుప ఖనిజం తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో కర్నూలు విజిలెన్స్ స్క్కాడ్, బనగానపల్లె, బేతంచెర్ల మైనింగ్ శాఖ అధికారులు సంయక్తంగా సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు.
బేతంచెర్ల, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): గూటుపల్లె గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్దంగా ఇనుప ఖనిజం తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో కర్నూలు విజిలెన్స్ స్క్కాడ్, బనగానపల్లె, బేతంచెర్ల మైనింగ్ శాఖ అధికారులు సంయక్తంగా సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. అక్రమంగా తవ్వి నిల్వ ఉంచిన 710 టన్నుల ఇనుప ఖనిజంతో పాటు ఒక ఎక్స్‌కవేటర్, రెండు టిప్పర్లు, ఒక క్యాంపర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కర్నూలు విజిలెన్స్ స్క్వాడ్ ఏడీ అనిత, ఆర్‌ఐ పురుషోత్తం, బేతంచెర్ల, బనగానపల్లె మైనింగ్ శాఖ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ ఈ దాడుల్లో పాల్గొన్నారు. అక్రమంగా తవ్విన ఇనుప ఖనిజానికి సంబంధించిన వివరాలపై తహశీల్దార్ నాగమణి, వీఆర్వోలకు నివేదికలు అందజేసినట్లు అధికారులు తెలిపారు.